ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తుంది ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ గురించి. ఈనెల 28వ తేదీన ఉత్కంఠభరితమైన పోరు జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ ను చూసేందుకు కొంత మంది ప్రేక్షకులు ఇక దేశం దాటి దేశం వెళ్తున్నారు. అయితే మరికొంత మంది ప్రేక్షకులు టీవీ ముందు కూర్చుని ఇక ఈ హై వోల్టేజీ మ్యాచ్ ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇరు జట్లు కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆసియా కప్లో భాగంగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.



 టి20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది భారత్.  ఇప్పుడు ఆసియా కప్ లో  ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది అని చెప్పాలి. ఇప్పటికే ఈ గడ్డపై అడుగుపెట్టిన అన్ని జట్లు అక్కడ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే మ్యాచ్ ముందు భారత్ పాకిస్తాన్ ఆటగాళ్లు ఎలా మెలుగుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.  కాగా ఎంతో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ భారత్ పాకిస్తాన్ ఆటగాళ్ళ స్నేహితుల్లా కలిసిపోయారు అనేది తెలుస్తుంది.


 ఈ క్రమంలోనే ఇక మైదానంలోకి ఎంట్రీ ఇచ్చిన భారత ఆటగాళ్లు అందరూ కూడా అప్పటికే మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్ లను  కలిశారు. ఈ క్రమంలోనే గాయం కారణంగా జట్టు దూరమైన  షాహీన్ అఫ్రిది ని కలిసి అతని గాయం ఎలా ఉంది అన్న విషయాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసిన ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. క్రీడాస్ఫూర్తి అంటే ఇదే కదా అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: