గత నాలుగు రోజుల నుండి కోయంబతూర్ వేదికగా సౌత్ జోన్ మరియు వెస్ట్ జోన్ జట్ల మధ్యన దులీప్ ట్రోఫీ ఫైనల్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన వెస్ట్ జోన్ మొదట బ్యాటింగ్ తీసుకుంది.. అయితే సౌత్ జోన్ బౌలర్లు చెలరేగడంతో మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 270 పరుగులకు ఆల్ అవుట్ అయింది. వెస్ట్ జోన్ ను సాయికిశోర్ అయిదు వికెట్లు తీసి కుప్పకూల్చారు. ఇక ఇతనికి బేసిల్ తంపి 2 వికెట్లు మరియు స్టీఫెన్ 2 వికెట్లు నుండి చక్కని సహకారం లభించింది. వెస్ట్ జోన్ ఇన్నింగ్స్ లో హెట్ పటేల్ ఒక్కడే 98 పరుగులు చేశాడు, ఉనాద్కట్ కూడా 48 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు.

సౌత్ జోన్ తన మొదటి ఇన్నింగ్స్ లో 327 పరుగులు చేసి 57 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. ఇంద్రజిత్ సెంచరీ ని సాధించాడు, ఇతనికి మనీష్ పాండే (48) నుండి చక్కని సహకారం లభించింది. వెస్ట్ బౌలర్లలో ఉనాద్కట్ 4 వికెట్లు, గజ 2 వికెట్లు మరియు అతీత సేథ్ 3 వికెట్లు తీసుకున్నారు. రెండవ ఇన్గ్స్ స్టార్ట్ చేసిన వెస్ట్ జోన్ కు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. మొదటి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ద సెంచరీ, సెంచరీ, ఒకటిన్నర సెంచరీ మరియు డబల్ సెంచరీ ని అందుకుని తన టీం ను పటిష్టమైన స్థితిలో నిలిపాడు. ఆఖరికి 265 పరుగుల వద్ద గౌతమ్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ గా వెనుతిరిగాడు.

ఇతను అతి చిన్న వయసులో డబల్ సెంచరి సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు వాడేకర్ (20 సంవత్సరాల 354 రోజుల) పేరిట ఉన్న రికార్డు కాస్త యశస్వి (20 సంవత్సరాల 269 రోజుల)  దెబ్బతో మరుగున పడిపోయింది. ప్రస్తుతం వెస్ట్ జోన్ 458 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా యశస్వి డబల్ సెంచరీ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ ఫుల్ హ్యాపీ గా ఉంది. ఎందుకంటే జైస్వాల్ ఐపీఎల్ లో రాజస్థాన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: