మొన్నటి వరకు భారత జట్టులో సీనియర్ బౌలర్గా ఎంతోమంది కొత్త ప్లేయర్లలో స్ఫూర్తిని నింపుతూ జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగింది ఝలన్ గోస్వామి. ఇక ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియా కు ప్రాతినిధ్యం వహిస్తూ తనదైన బౌలింగ్తో ఎన్నోసార్లు టీమ్ ఇండియాను విజయ తీరాలకు చేర్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇక అలాంటి ఝలన్ గోస్వామి  ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఇంకోన్నాళ్ళపాటు ఝలన్ గోస్వామి క్రికెట్లో కొనసాగుతుంది అని అభిమానులు భావించినప్పటికీ అలా జరగలేదు.

భారత మహిళల జట్టులో ఎన్నో ఏళ్లపాటు సేవలు అందించిన సీనియర్ బౌలర్ ఝలన్ గోస్వామి ఇటీవల తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎంతో మంది ప్రస్తుత క్రికెటర్లు మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ ఆమె టీమిండియా తరుపున చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాదు ఝలన్ గోస్వామి ఇప్పుడు వరకు అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన ఎన్నో రికార్డులు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయి.


 మరి ఇప్పటివరకు ఝలన్ గోస్వామి  భారత తరఫున వన్డేల్లో సాధించిన రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 ఇప్పుడు వరకు భారత మహిళల క్రికెట్లో 1000 పరుగులు చేసి 100 వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్గా కొనసాగుతుంది.

ఇక ఆమె కెరియర్ లో 255 వికెట్లు సాధించింది. ఇక భారత మహిళా క్రికెట్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

 ఝలన్ గోస్వామి కెరియర్లో  అత్యుత్తమ ఘనంగాలు 6-31 గా ఉంది.

ఇక ఎక్కువసార్లు ఐదు వికెట్ల హాల్ (2) సాధించిన క్రికెటర్ గా కొనసాగుతోంది.

 అంతేకాదు వన్డేలో పదివేల ఐదు బంతులు వేసింది ఝలన్ గోస్వామి.

 ఇక 69 క్యాచ్ లతో ఎక్కువ క్యాచ్లు పట్టిన మహిళ క్రికెటర్గా రెండవ స్థానంలో ఉంది.

 ఇక 250 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ఝలన్ గోస్వామి కొనసాగుతోంది.

 అంతేకాదు 200 వన్డేలు ఆడిన రెండవ ప్లేయర్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: