టి20 వరల్డ్ కప్ కి ముందు టీమ్ ఇండియా జట్టు వరుసగా టి20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడింది. టి20 సిరీస్ లో భాగంగా రెండు విజయాలు సాధించి సిరీస్ కైవసం చేసుకుంది అనే విషయం తెలిసిందే. ఇదే జోరుతో అటు సౌత్ ఆఫ్రికా తో కూడా మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది టీం ఇండియా. ఈ క్రమంలోనే భారత్ లోని తిరువనంతపురం వేదిక మొదటి టి20 మ్యాచ్ నేడు సాయంత్రం జరగబోతుంది.


 కాగా ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ విజయం సాధించి మంచి ఆత్మవిశ్వాసం తో ఉన్న ఇండియా ఇక నేడు సౌత్ ఆఫ్రికాపై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలీ. అంతే కాకుండా ఇక అక్టోబర్లో జరగబోయే వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకొని ఎవరిని తుడిచెట్టులోకి  తీసుకుంటారు.  ఎవరికి విశ్రాంతి కల్పిస్తారు అన్నది కూడా ఊహకంగానే మారిపోయింది అని చెప్పాలీ. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా తో ఆడబోయే మొదటి టి20 జట్టు యొక్క ఆటగాళ్ల వివరాలను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది.


 ఈ క్రమంలోనే జట్టుకు కీలక ప్లేయర్లు  దూరమయ్యారూ అన్నది తెలుస్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ రాహుల్ ఉండగా.. కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్,రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, అశ్విన్, చాహల్,అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్,  ఉమేష్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ షాబాద్ అహ్మద్ తో ఎంపిక చేసింది. కాగా దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా లాంటి కీలక ఆటగాళ్లకు ప్రస్తుతం టీమిండియా యాజమాన్యం విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. జట్టుకు విజయాన్ని అందించే కీలక ప్లేయర్లు లేకుండా సౌత్ ఆఫ్రికా తో మొదటి టి20 మ్యాచ్  ఆడుతున్న టీమిండియా ఎలా రానిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: