గత కొన్నేళ్ల నుండి టీమిండియాలో కీలక ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు రవీంద్ర జడేజా. ఆసియా కప్ సందర్భంగా గాయం బారిన పడ్డాడు అనే విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలోని కీలక ఆటగాడు దూరం కావడంతో ఇక టీమ్ ఇండియా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది  ఇకపోతే మోకాలి గాయం బారిన పడిన రవీంద్ర జడేజాకు శస్త్ర చికిత్స జరగడం ద్వారా ఆరు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక మోకాలు సర్జరీ అనంతరం ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ క్యాంపులో ఉన్నాడు రవీంద్ర జడేజా.


 అతను వరల్డ్ కప్ కి కూడా దూరం అయ్యాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇక ప్రస్తుతం మోకాలు గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పాలి. కాగా బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో రిహాబిటేషన్ లో ఉన్న రవీంద్ర జడేజా  ఇక తన గాయం ఎలా ఉంది అనే విషయానికి సంబంధించి అభిమానులకు ఎప్పటికప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తూ అప్డేట్ ఇస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే కాలికి కట్టు కట్టుకొని రవీంద్ర జడేజా మెల్లిగా అటు ఇటు నడుస్తున్న ఒక వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు అని చెప్పాలి.


 ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది  ఇక రవీంద్ర జడేజా త్వరగా కోలుకొని జట్టులోకి మళ్ళీ తిరిగి రావాలని అభిమానులు  కోరుకుంటూ ఉండడం గమనార్హం. కాగా  రవీంద్ర జడేజా లాంటి కీలక ఆటగాడు గాయం బారిన పడిన నేపథ్యంలో ఇక అటు టీమిండియా కాంబినేషన్ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఆసియా కప్ లో టీమిండియా వైఫల్యానికి రవీంద్ర దూరం కావడమే కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: