ప్రస్తుతం భారత క్రికెట్ లో స్టార్ బౌలర్ గా కొనసాగుతున్నాడు భువనేశ్వర్ కుమార్ . ఎన్నో ఏళ్ల నుంచి టీమ్ ఇండియాలో కీలక బౌలర్గా కొనసాగుతూ ఇక జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఎప్పుడు తన అద్భుతమైన బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తూ ఉంటాడు భువనేశ్వర్ కుమార్. ముఖ్యంగా పవర్ ప్లే లో బౌలింగ్ చేస్తూ ఒకవైపు పరుగులు కట్టడం చేయడమే కాదు మరోవైపు వికెట్లు పడగొట్టడంలో కూడా భువనేశ్వర్ కుమార్ సిద్ధహస్తుడు అని చెప్పాలి. ఇలా తనదైన బౌలింగ్ శైలితో టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.


 ప్రస్తుతం టీమిండియా లో ఉన్న స్టార్ బౌలర్ బుమ్రా తో కలిసి భువనేశ్వర్ కుమార్ కూడా మరో స్టార్ బౌలర్గా టీమిండియా కు ప్రధాన సీమర్ గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక తన బౌలింగ్ మెరుపులతో ఎప్పుడు ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టిస్తూ ఉంటాడు భువనేశ్వర్ కుమార్. ఇకపోతే ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో కూడా అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కుమార్ తన బౌలింగ్తో ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో కూడా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.


 టి20 చరిత్రలోనే ఏ బౌలర్ చేయని విధంగా అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన ఆటగాడిగా టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ టి20 కెరియర్ లో 10 మేయిడిన్ ఓవర్లు వేయడం గమనార్హం. అయితే ఇప్పుడు వరకు భువనేశ్వర్ కుమార్ వేసిన పది మేయిడిన్ ఓవర్లే అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు అత్యధికంగా కొనసాగుతూ ఉండటం గమనార్హం. భువి తర్వాత మరో టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా తొమ్మిది మేయిడిన్ ఓవర్లతో ఈ రికార్డు లో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక బుమ్రా అరుదైన రికార్డు సాధించడం పై అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: