
కానీ ఆ తర్వాత మాత్రం అజింక్య రహానే ప్రభావం తగ్గుతూ వచ్చింది అని చెప్పాలి. ఇక తర్వాత వరసగా అవకాశాలు వచ్చినప్పటికీ ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి ఎంతగానో ఇబ్బంది పడిపోయాడు. ఏడాది ఆరంభంలో సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు అని చెప్పాలి. అయితే తనతో పాటు జట్టులో స్థానం కోల్పోయిన మరో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చతేశ్వర పూజార కౌంటి ఛాంపియన్షిప్ లో పాల్గొని మళ్ళీ తన మునుపటి ఫామ్ నిరూపించుకుని ఇక ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చేసాడు. ఇక ఇప్పుడు అజింక్య రహనే రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఇటీవల హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్లో డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు. పృథ్విషా 19 పరుగులు చేసి అవుట్ కాగా యశస్వి జైష్వాల్ 195 బంతుల్లో 162 పరుగులు చేశాడు. అజింక్య రహానే 261 బంతుల్లో 26 ఫోర్లు మూడు సిక్సర్లతో 2004 పరుగులు చేసి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఇక డబుల్ సెంచరీ చేసిన అజింక్య రహనే మళ్ళీ జట్టులోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్.