
దీంతో సెంచరీల కింగ్ ఇస్ బ్యాక్ ఇక అతన్ని ఆపే వారే లేరు అంటూ అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో ఇక శ్రీలంకతో వన్ డే సిరీస్ లో కూడా విరాట్ కోహ్లీ అదరగొడతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు అని చెప్పాలి. కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఇక క్లీన్ బౌల్డ్ అయ్యి నిరాశపరిచాడు. అది కూడా స్పిన్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోవడం అటు అభిమానులకు అస్సలు రుచించడం లేదు అని చెప్పాలి.
అయితే విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్లో అవుట్ కావడం గురించి అటు సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శాంట్నర్ వేసిన స్ట్రెయిట్ డెలివరీని ఆడటంలో విఫలం కావడం సరికాడంటూ వ్యాఖ్యానించాడు. వికెట్ల లైన్ కు లోపలికి విరాట్ కోహ్లీ ఆడటంతోనే ఆ బంతికి వికెట్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాక్ ఫుట్ వేసి ఆడేందుకు ప్రయత్నించాడు. అదే ముందుకు ఆడి ఉంటే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునే వాడు. అదేమీ మరి వికెట్ల ముందు పడిన బంతి కాదు కానీ కాస్త టర్న్ అయ్యి విరాట్ కోహ్లీ బౌల్డ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకోవచ్చాడు.