ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన  తక్కువ సమయం లోనే తన ఫేస్ బౌలింగ్ తో ఊహించని రీతి లో పాపులారిటీ సంపాదించుకున్నాడు ఉమ్రాన్ మాలిక్.  ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి ఇక తన స్పీడ్ బౌలింగ్ తో ఒక్క సారిగా అందరికీ ఆకర్షించాడు. భారత క్రికెట్ లో ఉన్న బౌలర్లకు ఎవరికీ సాధ్యం కాని రీతి లో 150 కిలోమీటర్లకు పైగా వేగం  తో బంతులను విసిరి అందరిని ఆశ్చర్య పరిచాడు ఉమ్రాన్.


 ఇక అతడు టీమిండియా ఫ్యూచర్ స్టార్ అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కూడా కలిగించాడు. అంతేకాదు స్వయం గా మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ అతన్ని సెలెక్టర్లు వెంటనే జట్టు లోకి తీసుకోవాలని.. అలా అయితేనే అతని ఆట తీరుకు  మరింత మెరుగులు దిద్దెందుకు అవకాశం ఉంటుంది అంటూ డిమాండ్ కూడా చేశారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కాలం లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ అదర గొడుతున్నాడు. ఇక టి20 ఫార్మాట్లో మెరుపు వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్ధులకు ముచ్చమటలు పట్టిస్తూ వికెట్లు పడగొడుతున్నాడు.


 ఈ క్రమం లోనే ఉమ్రాన్ మాలిక్ స్పీడ్ బౌలింగ్ గురించి ఇక భారత సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్లో లైన్ అండ్ లెంత్ అందిపుచ్చుకుంటే ఉమ్రాన్ మాలిక్  ప్రపంచ క్రికెట్ ను శాసిస్తాడని కితాబు ఇచ్చాడు మహమ్మద్ షమి. 150 కిలోమీటర్ల వేగం తో బంతులు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక దేశానికి ప్రాతినిధ్యం వవిస్తున్నప్పుడు ఒత్తిడి ఉండడం సహజం. కానీ ఆ ఒత్తిడిని జయించాలి. ఇక మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా సాధించ గలుగుతామంటూ మహమ్మద్ షమి చెప్పుకొచ్చాడు. ఇటీవల కొత్త ఏడాదిలో శ్రీలంకలో జరిగిన టి20 సిరీస్ లో ఉమ్రాన్ మాలిక్ అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: