బిసిసిఐ మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రస్తుతం బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ తీసుకున్న ఇలాంటి నిర్ణయాలలో అటు ఉమెన్స్ ఐపిఎల్ నిర్వహించడం కూడా ఒకటి అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ ఏడాది మహిళల ఐపీఎల్ ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. విదేశీ క్రికెటర్లను కూడా ఉమెన్స్ క్రికెట్ లీగ్ లో భాగం చేస్తూ ఇక మహిళల క్రికెట్కు ఆదరణ పెంచడమె లక్ష్యంగా ముందుకు సాగుతుంది బీసీసీఐ అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవలే వేలం ప్రక్రియ కూడా ముగిసింది. మార్చి నెల నుంచి ఇక ఉమెన్స్ ఐపీఎల్ కు సంబంధించి మొదటి సీజన్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఈ లీగ్ కారణంగా ఎంతో మంది యువ మహిళా క్రికెటర్లకు కూడా మంచి లైఫ్ దక్కబోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇక మహిళా క్రికెటర్లు ఎంతో మంది ఫైనాన్షియల్ గా కూడా మేలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇక బిసిసిఐ నిర్వహించ తలపెట్టిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 మహిళా క్రికెట్ ను ప్రోత్సహించేందుకు బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు సిద్ధం కావడంపై హర్షం వ్యక్తం చేశాడు సౌరబ్ గంగూలీ. అయితే తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన హయాంలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలనే ప్రతిపాదన తెరమీదకి తీసుకు వచ్చాము అంటూ గుర్తు చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఐదు జట్లు మాత్రమే ఉన్నప్పటికీ.. ఇది కేవలం ఐదు జట్లకు మాత్రమే పరిమితం కాదని.. భవిష్యత్తులో మరిన్ని కొత్త జట్లు టోర్నీలోకి వస్తాయి అంటూ పేర్కొన్నాడు. ఇక అదే సమయంలో వన్డే ప్రపంచ కప్ పై స్పందిస్తూ ప్రస్తుతం టీమిండియా ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది. ఈసారి వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: