ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ క్రేజ్ ఎక్కడి వరకు అయితే పాకిపోయిందో.. ఇక ప్రతి చోట కూడా క్రిస్టియానో రోనాల్డో అభిమానులు ఉంటారు అని చెప్పాలి. అతని ఆట తీరును ఎంతగానో అభిమానిస్తూ ఇక అతను ఆడుతున్న ప్రతి మ్యాచ్ను కూడా వీక్షించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డోకు సొంత అభిమానుల మధ్య ఇటీవలే అవమానం ఎదురైంది.


 సాధారణంగా అయితే రోనాల్డో మంచేస్టర్ యునైటెడ్ క్లబ్ తో ఆడుతూ ఉంటాడు.  కానీ గత కొన్ని రోజుల నుంచి మంచేస్టర్ యునైటెడ్ క్లబ్ తో వివాదాలకు కొనసాగిస్తూ వస్తున్నాడు.  ఈ క్రమంలోనే పూర్తిగా ఆ క్లబ్ తో తెగ తెంపులు చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎవరు ఊహించిన విధంగా సౌదీ అరేబియా ఫుట్ బాల్ క్లబ్ అయిన ఆల్ నజర్ తో ఒప్పందం చేసుకున్నాడు క్రిస్టియానో రోనాల్డో. ఈ క్రమంలోనే ఇక ఆ జట్టు తరపున రోనాల్డో ఆడుతూ ఉన్నాడు అని చెప్పాలి.  ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడాడు.


 ఇందులో జర్మన్ తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఉంది అని చెప్పాలి. ఇక ఆ మ్యాచ్లో మెస్సిని డామినేట్ చేసిన రోనాల్డో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక అయ్యాడు. కానీ మ్యాచ్ లో మాత్రం రోనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ నజర్ ఓడిపోయింది. ఇక ఇటీవలే రోనాల్డో జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది అని చెప్పాలి. ఈ లీగ్ లో భాగంగా ఇటీవలే ఆల్ ఇతిహాద్ తో జరిగిన మ్యాచ్లో 3-1 తేడాతో ఆల్ అజర్ జట్టు ఓడిపోయింది. 90 నిమిషాల పాటు ఆడినప్పటికీ క్రిస్టియానో రోనాల్డో ఒక్క గోలు కూడా కొట్టలేకపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం క్రిస్టియానో రోనాల్డో పెవిలియన్ వైపు  వస్తున్న సమయంలో అక్కడ ఉన్న అభిమానులందరూ మెస్సి మెస్సి గట్టిగా అరుస్తూ ఇక రోనాల్డోని అవమానపరిచారు అని చెప్పాలి. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: