
ప్రపంచ క్రికెట్లో బలమైన జట్లుగా ఉన్న రెండు టీంలు ఢీ కొట్టబోతు ఉండడం తో అందరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ గురించే చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఇరుదేశాలకు చెందిన మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ రివ్యూలను ఇచ్చేస్తూ ఉన్నారు. గత కొంత కాలం నుంచి ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో సూపర్ ఫామ్ కనబరుస్తూ పరుగుల వరద పారీస్తూ ఉన్నాడు స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు భారత పర్యటనలో ఎలా రాణించబోతాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
ఇకపోతే ఇటీవలే ఇదే విషయంపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ టీమ్ ఇండియాకు సవాలుగా మారుతాడని విశ్లేషకులు అంటుంటే అశ్విన్ భిన్నం గా స్పందించడం గమనార్హం. నిజం గానే స్టీవ్ స్మిత్ తో సవాలే. కానీ అతడిని ఎదుర్కోవడానికి మన దగ్గర అక్షర్ పటేల్ ఉన్నాడు. అతను స్మిత్ కే ప్రమాదం కావచ్చు. ఆఫ్ సైడ్ వైపు అతను వేసే బంతులు ఏకంగా స్మిత్ ను ప్రమాదంలో పడేసే అవకాశం ఉంటుంది అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.