టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో అన్న విషయం గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మైదానంలో విరాట్ కోహ్లీ ఎనర్జీ చూసి ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ఒక్కసారిగా వనికి పోతూ ఉంటారు అని చెప్పాలి. అంతేకాదు ఇక ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా ప్రత్యర్థులతో గొడవలు దిగేందుకు కూడా ఎప్పుడూ అందరికంటే ముందే ఉంటాడు. కేవలం ఒక ఆటగాడిగా ఉన్నప్పుడే కాదు కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా ఇదే దూకుడును ప్రదర్శించాడు విరాట్ కోహ్లీ.


 అయితే మిగతా జట్లతో మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ..  ఆస్ట్రేలియా తో మ్యాచ్ అంటే మాత్రం కోహ్లీలో ఎక్కడలేని ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఏకంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ధీటుగా కవ్వింపులకు పాల్పడటం ఎన్నోసార్లు చూశాం. ఇక మరికొన్ని రోజుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కాబోతున్న నేపథంలో కోహ్లీ ఏం చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్న నేపథ్యంలో వరుస సెంచరీలు చేయడం ఖాయం అని కొంతమంది క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


 ఈ క్రమం లోనే ఆస్ట్రేలియా తో జరగబోయే టెస్ట్ సిరీస్ గురించి ఇటీవలే భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందించాడు. ఆస్ట్రేలియా పై మంచి ప్రదర్శన చేయడానికి.. ఆ జట్టు ప్లేయర్లను టీజింగ్ చేయడానికి కోహ్లీ ఎంతగానో ఇష్టపడతాడని సంజయ్ బంగర్ వ్యాఖ్యానించాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.. విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో సెంచరీ చేయక మూడేళ్లు గడిచిపోయిందని.. ఇక ఆస్ట్రేలియా తో జరగబోయే సిరీస్లో ఆ లోటును కోహ్లీ తప్పకుండా తీర్చుకుంటాడు అంటూ అభిప్రాయపడ్డాడు సంజయ్ బంగర్.

మరింత సమాచారం తెలుసుకోండి: