ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా భారత్ , ఆస్ట్రేలియా మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే బోర్డర్ గవాస్కర్  ట్రోఫీ గురించి చర్చ జరుగుతుంది అని చెప్పాలి.  అయితే ఇప్పటికే ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత్లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది.  ఈ క్రమంలోనే ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఇక ఎన్నో రివ్యూలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.  అంతేకాదు ఇంకా మొదటి టెస్ట్ మ్యాచ్ కూడా ప్రారంభం కాకముందే అటు ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరగబోయే నాలుగు టెస్ట్ మ్యాచ్లలో అద్భుతంగా రాణించేందుకు సిద్ధమైన ఎంతో మంది స్టార్ ప్లేయర్లు అరుదైన రికార్డులు సాధించడం పైనే కన్నేసారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డు పై ఆస్ట్రేలియా ఆటగాడు కన్నేసాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇప్పటివరకు 15 సార్లు జరిగింది. అయితే ఇప్పుడు వరకు ఈ సిరీస్ లో అత్యధిక శతకాలు సాధించిన ప్లేయర్గా 9 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు.


 ఇప్పటివరకు కూడా ఇవే అత్యధికం కావడం గమనార్హం. అయితే ఇక ఇప్పుడు భారత్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్  సిద్ధమయ్యాడు.. స్మిత్ ఇప్పటివరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 8 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ బాధితే సచిన్ రికార్డును సమం చేస్తాడు. ఒకవేళ రెండు సెంచరీలు కొట్టాడు అంటే సచిన్ రికార్డు బద్దలు అవుతుంది అని చెప్పాలి. అయితే ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 7 శతకాలతో ఉన్నాడు. ఇక సచిన్ రికార్డును అధిగమించాలంటే నాలుగు టెస్టుల్లో మూడు సెంచరీలు చేయాల్సి ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: