ఈ క్రమంలోనే కలల రాకుమారుడు కోసం ఎన్నో పగటి కలలు కూడా కంటూ ఉంటారు అని చెప్పాలి. చివరికి పెద్దలు చూసిన వారిని పెళ్లి చేసుకొని వారితో దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది అమ్మాయిలు ఇలా అందమైన యువకుడి కోసం వెతకడం.. తమకు నచ్చిన వాడు దొరికేంతవరకు కూడా ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సల్ చేసుకోవడం లాంటి విన్నాము. అయితే ఇక్కడ ఓ యువతి మాత్రం ఏకంగా దేవుడిని పెళ్లి చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.
ఇప్పటికే ఎంతోమంది ఏకంగా తమను తామే పెళ్లి చేసుకుని షాక్ ఇస్తుంటే.. ఇక్కడ ఒక యువతీ ఏకంగా లార్డ్ శివుడిని పెళ్లి చేసుకుంది. మధ్యప్రదేశ్లో ఈ ఘటన జరిగింది ఎంబీఏ చదివిన నికిత కుటుంబీకుల అంగీకారంతో బ్రహ్మకుమారి ఆశ్రమంలో వివాహ ఆచారం ప్రకారమే కళ్యాణ తోటలో కొలువై ఉన్న శివుడి మెడలో పూలమాలవేసి ఏకంగా పరమశివుడినే భర్తగా అంగీకరించింది. ప్రపంచంలో ప్రతి మనిషి విచారంగా ఉంటాడు. అందుకే నేను ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న అంటూ చెబుతుంది నికిత. ఏది ఏమైనా సదరు యువతి ఇలా ఏకంగా పరమశివుడిని పెళ్లి చేసుకుని.. భర్తగా అంగీకరించడం మాత్రం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి