గతకొంతకాలం నుంచి ఫార్మట్ తో సంబంధం లేకుండా యువ ఆటగాడు శుభమన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. తన ఆట తీరుతో తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు. ఒకవైపు సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు సైతం విఫలమవుతూ నిరాశ పరుస్తున్న వేళ ఇక మరోవైపున ఉన్న శుభమన్ గిల్ మాత్రం తనలో ఉన్న ప్రతిభను చాటి చెబుతూనే ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోజుల వ్యవధిలోనే సెంచరీలు బాదుతూ  ఇక ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంటూ ఉన్నాడు.


 అంతేకాదు డబుల్ సెంచరీ కూడా సాధించి ఇక అతి చిన్న వయసులోనే డబుల్ సెంచరీ సాధించిన ప్లేయర్గా కూడా ఎన్నో ప్రపంచ రికార్డులు కొల్లగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇలా ఇక అద్భుతమైన బ్యాటింగ్ తో  అదరగొడుతున్న శుభమన్ గిల్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా అంతకంతకు మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకుంటూ పైపైకి ఎగబాకుతూ పోతున్నాడు. అయితే ఇక ఇలా జనవరి నెల మొత్తం మంచి ఫామ్ కనబరిచిన శుభమన్ గిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ లో కూడా నామినేట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే మంచి ఫామ్ కనబరుస్తున్న శుభమన్ గిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కాలని ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయపడ్డారు. ఇక అందరూ అనుకున్నట్లుగానే గిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. పోటీలో నిలిచిన మహమ్మద్ సిరాజ్, డేవన్ కాన్వేలను వెనక్కి నెట్టి ఇక జనవరి నెలకు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్నట్లు ఐసిసి ప్రకటించింది. జనవరిలో పరుగుల వరద పారించిన గిల్ 567 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడంపై ఎంతోమంది అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: