ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ప్రస్తుతం అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ ఎంతో రసవతరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు మొదటి రెండు మ్యాచ్లలో కూడా చిత్తుగా ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. భారత స్పిన్ బౌలింగ్ ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లందరూ కూడా చేతులెత్తేశారు.


 దీంతో ఎంతో అలవోకగా భారత జట్టు ఆస్ట్రేలియా ను 4-0 తేడాతో క్లీన్ స్వీట్ చేయడం ఖాయమని విశ్లేషకులు కూడా అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి అద్భుతంగా పుంజుకుంది ఆస్ట్రేలియా జట్టు. మూడో టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియన్ ఓడించి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న ఆస్ట్రేలియా.. ఇక ఇప్పుడు నాలుగో టెస్ట్ మ్యాచ్లో కూడా పట్టు బిగిస్తూ టీమ్ ఇండియాలో ఓటమి భయాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు అందరూ కూడా నాలుగో టెస్ట్ మ్యాచ్లో పరుగుల వరద పారిస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఉస్మాన్ కవాజా  ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 422 బంతులు ఎదుర్కొన్న ఉస్మాన్ ఖవాజా క్రీజులో పాతుకు పోయి 180 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. భారత్ వేదిక ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఆటగాడిగా ఉస్మాన్ ఖవాజా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 1979లో యాలోప్ ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో 392 బంతులు ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పుడు నాలుగో టెస్ట్ మ్యాచ్ లో 422 బంతులు ఎదుర్కొని  42 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు ఉస్మాన్ ఖవాజా.

మరింత సమాచారం తెలుసుకోండి: