ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో సీనియర్లుగా మారుతున్న ఆటగాళ్లు మిగతా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ఏదో ఒక ఫార్మాట్కు మాత్రమే పరిమితం అవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇలా స్టార్ ప్లేయర్లు ఇక కొన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉండటం మాత్రం ఇటీవల కాలంలో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఇంగ్లాండు జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న మోయిన్ అలీ సైతం తన రిటైర్మెంట్ విషయంలో చిన్న హింట్ ఇచ్చాడు అనేది మాత్రం తెలుస్తుంది.


 ఇటీవల ఇంగ్లాండు జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా ఏకంగా పసికున బంగ్లాదేశ్ చేతిలో విశ్వ విజేత ఇంగ్లాండ్ టి20 మ్యాచ్ లో వైట్ వాష్ కావడం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. బంగ్లాదేశ్  పట్టుదల ముందు అటు ఇంగ్లాండ్ ఆటతీరు ఎక్కడ సరితూగలేదు అని చెప్పాలి. టి20 క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్గా కొనసాగుతున్న ఇంగ్లాండ్ ను ఓడించడంతో బంగ్లాదేశ్ అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. ఇదంతా పక్కన పెడితే ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్లో కొనసాగుతున్న మోయిన్ అలీ  రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చాడు.


 ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది భారత్తో జరగబోతున్న వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇక క్రికెట్ కి గుడ్ బై చెప్పనున్నట్లు చెప్పుకొచ్చాడు. నేను రిటైర్ కాను అని చెప్పను.. అలాగని అవ్వకుండా ఉండలేను. మరో ఏడు ఎనిమిది నెలల్లో నా వయసు 35 ఏళ్లలోకి అడుగుపెడుతుంది. రిటైర్మెంట్ వయసు వచ్చేస్తుందనిపిస్తుంది. ఎలాంటి గోల్స్ పెట్టుకోదలుచుకోలేదు. ఇక ఈ ఏడాది ఇండియాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ ఆడి గెలవాలనుకుంటున్న.. బహుశా అదే నా చివరి వన్డే కావచ్చు అంటూ కావచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అతను వన్డే ఫార్మేట్ కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించి టి20 లలో కొనసాగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: