2023 ఐపీఎల్ సీజన్ హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీ నుంచి కూడా ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని  ఇక ఐపీఎల్ కోసం అందరికంటే ముందు నుంచే మైదానంలోకి దిగి ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్నాడు. ఇందుకు సంభందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతుంది.


 ఇది నిజమా కాదా అనే విషయంపై అభిమానులు కూడా కన్ఫ్యూషన్ లో ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఇదే విషయంపై ధోని ఆప్తమిత్రుడు అయినా సురేష్ అయినా ఆసక్తికర సమాధానం చెప్పాడు. ప్రస్తుతం సురేష్ రైనా లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటున్నారు.. నిజమేనా అంటూ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. ధోని వచ్చే ఐపిఎల్ సీజన్ లో కూడా ఆడాలని కోరుకుంటున్నా. కానీ అతని మనసులో ఏముంది అన్నది మనకు తెలియదు. ధోని బాగా బ్యాటింగ్ చేస్తాడు. ఇక ఫిట్నెస్ లో అతనికి తిరుగులేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ప్రదర్శన పైనే వచ్చే ఏడాది సీజన్ ఆడాల వద్ద అనే నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది అంటూ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. సంవత్సరం నుంచి క్రికెట్ ఆడని ధోని,అంబటి రాయుడుకు సవాల్ తప్పదు. జట్టు ఇప్పటికి చాలా బలంగా ఉంది. చాలా మంది యువ ఆటగాళ్లు నిరూపించుకుంటున్నారు. ఈ ఏడాది చెన్నై జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎలా ఆడతారో చూడాలి అంటూ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. అయితే ధోని ఫోన్లో అందుబాటులో ఉండడని ఎంతో మంది చెబుతుంటారు. అయితే తాను మాత్రం ధోనితో టచ్ లోనే ఉన్నట్లు రైనా చెప్పుకొచ్చాడు . ధోని నెట్ ప్రాక్టీస్ లో భారీ షాట్లు కొడుతున్నట్లుగానే మైదానంలో కొడితే ఇక తిరుగు ఉండదు అంటూ రైన అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl