
పాకిస్తాన్ మాజీ ఆటగాడు శోయబ్ అక్తర్ ఏకంగా సచిన్ టెండూల్కర్ కాళ్ళ మీద పడే క్షమించమని అడిగాడట. ఇక ఇందుకు సంబంధించిన విషయాన్ని సచిన్ సహచరుడు అయిన మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు అని చెప్పాలి. సచిన్ షోయబ్ మధ్య జరిగిన సంఘటన గురించి ఎప్పుడు ప్రస్తావించిన భారత క్రికెటర్లు నవ్వకుండా ఉండలేరు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఒక సమయంలో సచిన్ టెండూల్కర్ ను షోయబ్ తన భుజాలపై ఎత్తుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.
దీంతో ఇద్దరు కూడా కింద పడిపోయారు. సచిన్ భారతీయుల ఆశల్ని తన భుజాలపై మోస్తున్నాడు అందుకే ఇంత బరువు ఉన్నాడని షోయబ్ చమత్కరించాడు. ఓసారి లక్నోలో భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య పార్టీ జరిగింది. అప్పుడు షోయబ్ చాలా తాగాడు. సచిన్ ను ఎత్తుకునే ప్రయత్నం చేస్తే.. అతడు చాలా బరువు ఉండటంతో తనని ఎత్తడం షోయబ్ వల్ల కాలేదు. ఇద్దరు ఒకసారిగా కిందపడిపోయారు. ఆ సమయంలో నేను కూడా నవ్వాను. అయితే ఆ ఘటనతో షోయబ్ ఎంతో ఇబ్బంది పడ్డాడు. తనను నేను చాలా ఆటపట్టించాను. నీ పని అయిపోయింది. ఇక నీ కెరియర్ ప్రశ్నార్థకమే. మా జట్టులో గొప్ప ఆటగాడిని కింద పడేసావ్ అంటూ ఆటపట్టించాను. నా మాటలను సీరియస్ గా తీసుకున్న షోయబ్ సచిన్ ఎక్కడ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తాడో అని భయపడి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగాడూ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు..