ఫిబ్రవరి 9 నుండి నిన్నటి వరకు ఆస్ట్రేలియా ఇండియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ముందు జరిగిన టెస్ట్ సిరీస్ ను ఇండియా 2 -1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోపీని దక్కించుకోగా... ఆ తర్వాత జరిగిన మూడు వన్ డే ల సిరీస్ లో మాత్రం హోరా హోరీగా జరిగిన మ్యాచ్ లలో ఆస్ట్రేలియా 2 -1 తేడాతో గెలుపొంది ఘనంగా స్వదేశానికి పయనం అయింది. ముంబై లో జరిగిన మొదటి వన్ డే లో ఇండియా అయిదు వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత వైజాగ్ వేదికగా జరిగిన రెండవ వన్ డే లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో గెలిచి ఇండియాను దెబ్బ కొట్టింది.

అలా రెండు వన్ డే ల తర్వాత సిరీస్ 1 -1 తో సమం అయింది. సిరీస్ డిసైడర్ గా నిన్న చెన్నై లో జరిగిన మూడవ వన్ డే లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా పిచ్ ను దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్ ను ఎంచుకుంది. కానీ ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా 49 ఓవర్ లలో 269 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో మార్ష్ (47) టాప్ స్కోరర్ గా నిలువగా , ఇతనికి క్యారీ (38), హెడ్ (33), లాబుచెన్ (28) లు తలో చెయ్యి వేసి ఆ మాత్రం స్కోర్ రావడంలో ఉపయోగపడ్డారు. ఇండియా బౌలింగ్ లో హార్దిక్ పాండ్య మరియు కుల్దీప్ యాదవ్ లు తలో మూడు వికెట్లు తీసుకోగా, సిరాజ్ మరియు అక్షర్ పటేల్ లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

ఛేజింగ్ లో ఇండియాకు ఓపెనర్ల నుండి చక్కని భాగస్వామ్యం అందినా... వరుసగా ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. అయినా ఆయా తేడా ఎక్కడ కనబడనివ్వకుండా కోహ్లీ మరియు రాహుల్ లు మూడవ వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే వరుసగా రాహుల్ (32), కోహ్లీ (54), అక్షర్ పటేల్ (2) వికెట్లు పడడంతో ఇండియా కష్టాల్లో పడింది. ఇక మరోసారి కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొన్న మొదటి బంతికి బౌల్డ్ అయ్యి వెనుతిరిగాడు. దానితో మరో 21 పరుగుల దూరంలో ఇండియా ఆల్ అవుట్ అయింది . ఖచ్చితంగా గెలిచే మ్యాచ్ లో ఆటగాళ్లు చేతులెత్తేయడంతో ఆసీస్ చేతిలో చిత్తయింది. అలా ఆస్ట్రేలియా మూడు వన్ డే ల సిరీస్ ను 2  -1తో దక్కించుకుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: