
సూర్య కుమార్ యాదవ్ మీద నమ్మకం ఉంచి అటు జట్టు యాజమాన్యం అతనికి వరుసగా అవకాశాలు ఇస్తుంది అని చెప్పాలి. అయినప్పటికీ అతను మాత్రం నిరూపించుకోలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అయితే సూర్యకుమార్ పూర్తిగా చేతులెత్తేస్తాడు అని చెప్పాలి. వరుసగా మూడు మ్యాచ్‌లలో కూడా మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ గా వెను దిరిగి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో ఇక సూర్యకుమార్ వన్డేలకు సెట్ కాడూ అని అటు భారత అభిమానులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు.
ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్లో తరచూ విఫలమవుతూ ఇక జట్టుకు మైనస్ గా మారిపోతున్న సూర్య కుమార్ యాదవ్‌ను పక్కకు పెట్టి సంజూ శ్యాంసన్ ను జట్టులోకి తీసుకోవాలి అంటూ ఇటీవలే మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సూచించాడూ. సంజు సాంసంగ్ 11 వన్డే మ్యాచ్ లలో 66 సగటుతో 330 పరుగులు చేశాడు అని గుర్తు చేశాడు. అయితే 3 మ్యాచ్ లలో గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగిన సూర్యకుమార్ పై తనకు సానుభూతి ఉందని.. 11వ స్థానంలో వచ్చిన బౌలర్ కి సైతం ఇలా జరగదని... సూర్యకుమార్‌కు మరోసారి ఇలా జరగకూడదని కోరుకుంటున్నా అంటూ తెలిపాడూ.