
ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన పై అటు తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానీష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. వన్డే ప్రపంచ కప్ ను భారత జట్టు గెలవాలంటే మెరుగైన బౌలింగ్ యూనిట్ ఎంత అయిన అవసరం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు పాకిస్తాన్ మాజీ. ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఈ విషయం గురించి మాట్లాడాడు. వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టుకు మెరుగైన బౌలర్లు అవసరం ఉంది.
ఇక ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్లతో అయితే భారత జట్టు వన్డే వరల్డ్ కప్ ను అస్సలు గెలవలేదు. బుమ్రా అందుబాటులో లేడు కాబట్టి ఉమ్రాన్ మాలిక్, హర్షదీప్ సింగ్, టి నటరాజన్ వంటి బౌలర్లకు అవకాశం ఇవ్వాలి. అయితే భారత బ్యాట్స్మెన్లు స్పిన్ అద్భుతంగా ఆడుతారు అన్న విషయం అందరికీ తెలుసు. అయితే వారు నెట్స్ లో ముఖ్యంగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, చాహల్ స్పిన్ బంతులను ఎదుర్కొంటారు. అయితే వాళ్లు కాస్త వేగంగా బంతులు వేయడం వల్ల బంతి ఎక్కువగా టర్న్ కాదు. కానీ ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా బంతిని టర్న్ చేశారు అంటూ డానీష్ కనేరియా చెప్పుకొచ్చాడు.