
మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం అవుతుందని ఇలాంటి జట్టుతో వరల్డ్ కప్ గెలవాలనుకుంటే మాత్రం కష్టమే అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా టీమ్ ఇండియా ప్రదర్శన పై తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జట్టులో ఇప్పటికైనా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయపడుతున్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా టీమ్ ఇండియా పై వస్తున్న విమర్శలపై జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న రవిచంద్రన్అశ్విన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒక సిరీస్ ఓటమి తో టీమిండియా బలహీనమైన జట్టు అని ఎంతో మంది అంటున్నారు. మాది ఎప్పటికీ బలమైన జట్టే అంటూ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. మేము ఎప్పుడూ కూడా గెలవాలనే పట్టుదల తోనే ఆడుతాం అంటూ తెలిపాడు. ఇక టీమిండియా ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు క్రికెట్ అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు. ఇది జట్టు స్థిరత్వంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటూ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ ను 2-1 తేడాతో భారత జట్టు కోల్పోయింది అని చెప్పాలి.