
ఈ క్రమంలోనే ఎంతో మంది మాజీ ప్లేయర్స్ అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై రివ్యూ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే నేడు డివై పాటిల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలబడుతుంది అని చెప్పాలి. టోర్నీ ఆరంభంలో దూకుడు కనబరిచిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వెనుకబడటంతో ఫైనల్ చేరేందుకు ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. అయితే ఢిల్లీ మాత్రం సరైన సమయంలో సత్తా చాటి వరుస విజయాలతో రన్ రేట్ పెంచుకొని అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఇక ఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారం ఓపెనర్ మేగ్ లానింగ్ తో పాటు షేఫాలి వర్మ, జమీయ రోడ్రిక్స్ ల పైనే ఉంది అని చెప్పాలి. ఆల్రౌండర్ గా మరిజాన్ కప్ ఇప్పటివరకు కీలకపాత్ర పోషించింది. ఇక మరోవైపు హార్మన్ ప్రీత్ కౌర్ ఇక మంచి ఫామ్ లో లేకపోయినా నాట్ సివర్, హీలి మాథ్యూస్ ముంబై జట్టుకు భారీ స్కోరు అందించగలిగిన ప్లేయర్ గా ఉన్నారు. అమేలీయ కేర్ రూపంలో దాటిగా ఆడే మరో బ్యాటర్ కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో పోల్చి చూస్తే ముంబైకి బలమైన బౌలింగ్ లేనప్పుడు ఉంది. ఇక నేడు ఫైనల్ లో ఎవరు గెలుస్తారు తెలియాలంటే మాత్రం మ్యాచ్ పూర్తయ్యేంతవరకు ఆగాల్సిందే.