
టీమిండియా కెప్టెన్సీ అంటే అది ఎంత గొప్ప పదవి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ లో కూడా అటు భారత గౌరవాన్ని భుజాన వేసుకోవాల్సి ఉంటుంది రోహిత్ శర్మ. ఇక అలాంటి రోహిత్ శర్మ ప్రస్తుతం అత్యున్నత స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక క్రికెటర్గా ఎదుగుతున్న సమయంలో మాత్రం రోహిత్ శర్మ ఎన్నో కష్టాలను పడ్డాడట. ఏకంగా ఒకానొక సమయంలో పాల ప్యాకెట్లను కూడా డెలివరీ చేసే బాయ్ గా పనిచేశాడట రోహిత్ శర్మ. ఇక ఇటీవల ఈ విషయాన్ని రోహిత్ శర్మ కి ఎంతో సన్నిహితుడైన ప్రజ్ఞన్ ఓజా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అని చెప్పాలి.
ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగు పెట్టడానికి రోహిత్ శర్మ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు అంటూ ప్రజ్ఞాన్ ఓజా చెప్పుకొచ్చాడు. ప్రాక్టీస్ లో భాగంగా కొత్త క్రికెట్ కిట్ కొనుగోలు చేసేందుకు రోహిత్ శర్మ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. చివరికి క్రికెట్ కిట్ కొనుగోలు చేసేందుకు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏకంగా పాల ప్యాకెట్ల డెలివరీ బాయ్ గా కూడా పనిచేశాడు. ఇలా పాల ప్యాకెట్లు డెలివరీ చేయగా వచ్చిన డబ్బులతో కష్టపడి క్రికెట్ కిట్టు కొనుగోలు చేసి ఇక తన ఆటను కొనసాగించాడని ప్రజ్ఞా తెలిపాడు.