నేటి నుంచి ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ మొదలు కాబోతుంది. ఇక క్రికెట్ కు సంబంధించి అసలు సిసలైన మజాను పొందెందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ సిద్ధమవుతున్నారు. అయితే ఎప్పటిలాగే సీనియర్లు ఐపీఎల్లో ఆడేందుకు సిద్ధమవుతుండగా.. ఈ ఏడాది ఐపీఎల్ లో కొంతమంది కొత్తగా ఈ క్యాష్ రిచ్ లీగ్ లోకి అడుగు పెట్టబోతున్నారు అని చెప్పాలి. ఇలా ఐపీఎల్లో కొత్తగా అడుగు పెట్టబోతున్న ఆటగాళ్ళలో అటు ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ అయిన హ్యారి బ్రూక్స్ కూడా ఉండడం గమనార్హం. గత కొంతకాలం నుంచి హ్యారి బ్రూక్స్ మంచి ఫామ్ కనబరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే అతనిపై భారీగా నమ్మకాన్ని పెట్టుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గత ఏడాది చివర్లో జరిగిన మినీ వేలంలో 13.25 కోట్లు పెట్టి మరి హ్యారి బ్రూక్స్ ను జట్టులోకి తీసుకుంది.  అయితే గత రెండు సీజన్లోనూ లీగ్ స్టేజ్ కే పరిమితమై విమర్శల పాలైన సన్రైజర్స్..  ఇక ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని భావిస్తుంది అని చెప్పాలి. ఈసారి కొత్తగా ఐడెన్ మార్కరమ్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు హైదరాబాద్ అభిమానులు సైతం అటు హ్యారి బ్రూక్స్ పై భారీ రేంజ్ లోనే అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు అందరిలో జోష్ నింపే విధంగా ఇంగ్లాండ్ మాజీ ఫేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.



 ఐపీఎల్ 16వ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా హ్యారి బ్రూక్స్ నిలుస్తాడు అంటూ స్టివ్ హర్మిషన్ చెప్పుకొచ్చాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును కూడా అతని సొంతం చేసుకుంటాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తాడు.  ఆరెంజ్ క్యాప్ పోటీలో అందరిని వెనక్కినట్టు హ్యారి బ్రూక్స్ ముందుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే అతని వద్ద ఆరెంజ్ కిట్ ఉంది కదా. ఈ సీజన్లో అతడే అత్యుత్తమ ఆటగాడిగా  అనిపిస్తుంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలుస్తాడు. సిరీస్ అసాంతం హ్యారి బ్రూక్స్ రానిస్తే మాత్రం సన్రైజర్స్ అద్భుత ఫలితాలను అందుకోవడం ఖాయం అంటూ స్టివ్ హార్మిసన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇప్పటివరకు టెస్ట్ వన్డే ఫార్మాట్లో బాగానే రానించిన హ్యారి బ్రూక్స్ కు టి20 ఫార్మాట్లో మాత్రం గొప్ప ప్రదర్శన లేదు. మరి ఐపీఎల్ లో ఏం చేస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl