ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ అనేది ఎలా భాగంగా మారిపోయిందో అచ్చం అలాగే టీవీ కూడా ఒక భాగంగా మారిపోయింది అని చెప్పాలి. ముఖ్యంగా నేటి రోజుల్లో ఆడవాళ్లు మగవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా  టీవీ సీరియల్స్ ఫాలోవర్లుగా మారిపోతున్నారు. దీంతో ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ చేయకుండా ప్రతిరోజు టీవీ టీవీ చూస్తున్నారు. ఇక ఇలా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచేందుకు బుల్లితెరపై ఏదో ఒక కొత్త కార్యక్రమం ప్రసారమవుతుండడంతో టీవీ నుంచి పక్కకు జరగలేకపోతున్నారూ చాలామంది. అయితే టీవీ ఎక్కువగా చూడటం వల్ల కాళ్ళపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతూ ఉంటారు.


 అయితే టీవీని ఎంత దూరం నుంచి చూడాలి.. ఇక ఎన్ని అంగుళాల టీవీని ఎంత దూరం నుంచి చూస్తే మంచిది అన్న విషయంపై ఇప్పటికి చాలామందికి క్లారిటీ లేదు. ఇక ఆ విషయాలేంటో తెలుసుకుందాం..

 24 అంగుళాల టీవీని మూడు అడుగుల దూరం నుంచి చూడవచ్చు. అలా అని ఇక ఐదు అడుగుల కంటే ఎక్కువ దూరం నుంచి చూసినా కూడా కంటి సమస్యలు వస్తాయట.

 32 అంగుళాల టీవీని ఆరడుగుల దూరం నుంచి చూడవచ్చట. ఇక గరిష్టంగా ఏడు అడుగుల దూరం చూస్తే మంచిదట. లేదంటే టీవీ నుంచి వచ్చే కిరణాలు కళ్ళకి హాని కలిగిస్తాయట.


 ఒకవేళ మీరు 43 అంగుళాల టీవీని వాడుతున్నట్లయితే.. ఇక దానిని చూసే వ్యక్తి దూరం ఆరు అడుగుల మించి ఎనిమిది అడుగుల లోపు ఉండాలట. అయితే ఈ ప్రమాణాలు అన్నీ కూడా హెచ్డి మరియు ఫుల్ హెచ్డి స్క్రీన్ ల కోసమే అన్నది తెలుస్తుంది

 ఒకవేళ మీరు 50 నుంచి 55 అంగుళాల టీవీని కలిగి ఉంటే పది అడుగుల కంటే దూరంగా 12అడుగుల లోపు దగ్గరగా ఉండి టీవీ ని చూడాలట. అలా అయితే ఇక కంటికి హాని కలగదు అని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tv