ఐపీఎల్ ప్రారంభమైందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఎన్నో రోజుల నుంచి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న క్యాష్ రిచ్ నేటి నుంచే ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. అయితే ఇంకా ఈ లీగ్ కు సంబంధించి మ్యాచ్లు మొదలుకానే లేదు. అప్పుడే ఇక ఎవరు బాగా రాణిస్తారు అన్న విషయంపై రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తున్నారు మాజీ ఆటగాళ్లు. ఐపీఎల్ సమయంలో ఇలాంటి రివ్యూలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో టైటిల్ విజేతగా నిలిచే జట్టు ఏది.. బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించి ఇక ఎక్కువ పరుగులు చేసిఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే ప్లేయర్లు ఎవరు? ఇక ఎక్కువ వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్స్ సొంతం చేసుకునే బౌలర్లు ఎవరు అనే విషయంపై మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ఒక అంచనాకు వచ్చి ఇక అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా ఐపీఎల్ మొదటి మ్యాచ్ కూడా ప్రారంభం కాకముందే ఇలాంటి రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు మాజీలు.


 అయితే ఇలా క్రికెట్ కు సంబంధించిన రివ్యూలు ఇవ్వడంలో ఎప్పుడు ముందుండే భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఇక ఇటీవల మరోసారి తన రివ్యూ ని సోషల్ మీడియాలో చెప్పేసాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్ పై ప్రశంసలు కురిపించాడు. గత సీజన్లో రాహుల్ 616 పరుగులు దికాకు 508 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్  లో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక ఈసారి కూడా ఈ ఇద్దరు ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటారు అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. రాహుల్ ఫామ్ లేమీతో ఇబ్బంది పడుతున్నాడని.. ఆ పరిస్థితులను బయటికి రావాలని.. ప్రతి సీజన్లో లాగానే ఈ సీజన్లో కూడా బాగా పరుగులు చేయాలని ఆకాష్ చోప్రా ఆకాంక్షించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: