ఇటీవల కాలంలో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించి తమ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేసుకోవాలని ఎంతోమంది ఆశ పడుతున్నారు అని చెప్పాలి. వఈ క్రమంలోనే ఒకే విషయంపై ఏళ్ల తరబడి సాధన చేసి ఇక ప్రపంచంలో తమలాగా ఆ పనిని ఇంకెవరు చేయలేరు అన్న విషయాన్ని నిరూపించి.గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో తమ పేరును ఎక్కించుకుంటున్నారు. ఇలా కొంతమంది అయితే గిన్నిస్ బుక్ సాధించడం కోసం ఏకంగా ప్రాణాలను సైతం రిస్కులో పెట్టి ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉండడం కూడా ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం.


 మరి కొంతమంది రోజువారి జీవితంలో చేసే పనులనే కాస్త విచిత్రంగా ఎవరికి సాధ్యం కాని రీతిలో సరికొత్తగా చేసి గిన్నిస్ బుక్ రికార్డులు కొడుతున్నారు అని చెప్పాలి. అయితే నాలుగేళ్ల కుర్రాడు ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు అంటే నమ్ముతారా. సాధారణంగా అయితే నాలుగేళ్ల కుర్రాడు ఇంకా తన స్నేహితులతో ఆడుకుంటూ తల్లిదండ్రుల దగ్గర మారం చేస్తూ ఎప్పుడు అల్లరి చేష్టలు చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ నాలుగేళ్ల పిల్లాడు మాత్రం అలా చేయలేదు. ఆ వయసులో అందరూ ఆడుకుంటుంటే అతను మాత్రం అద్భుతం చేసి ఏకంగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు కొట్టాడు.


 యూఏఈకి చెందిన నాలుగేళ్ల కుర్రాడు సయిద్ రషీద్ అల్మే మేరీ గిన్నిస్ రికార్డు సృష్టించాడు. అతను రాసిన ది ఎలిఫెంట్ సయిద్ అండ్ ది బేర్ అనే పుస్తకం ఆ దేశంలో అద్భుతమైన ఆదరణ పొందింది అని చెప్పాలి. మార్చి 9 నాటికి 1000 కాపీలు అమ్ముడుపోవడంతో ఇక అతను రికార్డు సృష్టించినట్లు గిన్నిస్ బుక్ రికార్డు ప్రతినిధులు తెలిపారు. సయ్యద్ అక్క కూడా 8 ఏళ్లకే గిన్నిస్ రికార్డు సృష్టించింది. 8 ఏళ్ల వయసులోనే ఒక పుస్తకాన్ని రెండు భాషల్లో రాసిన అతిపిన్న వయసుకురాలిగా గిన్నిస్ రికార్డు సృష్టించడం గమనార్హం. ఏదేమైనా ఆడుకోవాల్సిన నాలుగేళ్ల వయసులో అతను సాధించిన రికార్డు గురించి తెలిసే ప్రతి ఒక్కరు కూడా హాట్సాఫ్ చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: