
అప్పుడు వరకు అంతా సంతోషంగా గడిపిన వారు చూస్తూ చూస్తుండగానే.. క్షణాల వ్యవధిలో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదులుతున్నారు. ఇక వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ మనిషి జీవితం ఇంతేనా అనే భావన ప్రతి ఒక్కరిలో కలిగేలా చేస్తూ ఉన్నాయి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకున్న.. ప్రతిరోజు వ్యాయామం చేసిన ఇలాంటి సడెన్ హార్ట్ ఎటాక్ల నుంచి మాత్రం మనిషి తప్పించుకోలేకపోతున్నాడు అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవలే సిద్దిపేట జిల్లాలో కూడా ఇలాంటి విషాదకర ఘటన చోటుచేసుకుంది. హుస్నాబాద్ లో జరుగుతున్న కేఎంఆర్ క్రికెట్ టోర్నమెంటులో ఒక యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఆంజనేయులు అనే యువకుడు బౌలింగ్ చేస్తూ కార్డియాక్ అరెస్టుతో కుప్పకూలిపోయాడు. మిగిలిన ఆటగాళ్లు వెంటనే అతని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆంజనేయులు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మునీరుగా విలపించారు అని చెప్పాలి.ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే అప్పుడు వరకు తమ ముందే సంతోషంగా క్రికెట్ ఆడిన స్నేహితుడు ఇక లేడు అన్న విషయాన్ని అటు మిగతా స్నేహితులు అస్సలు జీవించుకోలేకపోయారు అని చెప్పాలి.