టైటిల్ చూడగానే షాక్ అయ్యారు కదా.. ధోని చెప్పిన మాట విని ఉన్నత స్థానంలోకి ఎదగాలి . కానీ ఏకంగా పోలీస్ ఉద్యోగం మానేసి గొర్ల కాపరిగా మారడం ఏంటి.. ఇదేదో విచిత్రంగా ఉందే అని అనిపించింది కదా.. అసలు స్టోరీ ఏంటో తెలిస్తే మాత్రం మీకే క్లారిటీ వస్తుంది. అతను చిన్నప్పటినుంచి పోలీస్ కావాలని ఎంతగానో ఆశపడ్డాడు. ఇక సినిమాల్లో లాగానే నిజజీవితంలోనూ రౌడీల ఆటలు కట్టించాలని నిర్ణయించుకున్నాడు. ఇక పోలీస్ అవ్వడం కోసం ఎంతగానో కష్టపడ్డాడు ఇక చివరికి పోలీస్ కానిస్టేబుల్ జాబ్ సంపాదించాడు.


 కానీ పోలీసు జాబ్ సాధించిన తర్వాత ఏం చేయాలనుకున్నాడో అది చేయలేకపోయాడు. ఇక అతను ఊహించినట్లుగా అక్కడ అస్సలు లేదు  దీంతో ఇక జాబ్ మానేయడమే బెటర్ అని నిర్ణయించుకున్నాడు. ఇక కొన్నాళ్లపాటు మనసు చంపుకొని పనిచేశాడు. ఇక అతని భార్య కూడా పోలీస్ కానిస్టేబుల్ దీంతో భార్యతో మాట్లాడి జాబ్ మానేస్తాను. గొర్రెలు మేపుకుంటూ జిమ్ నడుపుతూ డబ్బులు సంపాదిస్తాను అని చెప్పాడు. ఇక ఆమె కూడా అంగీకరించడంతో పోలీస్ జాబ్ వదిలేసాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు కురువాడి పట్టి గ్రామంలో జరిగింది.


 36 ఏళ్ల సతీష్ గతంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశాడు. 2009లో సతీష్ తమిళనాడు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పని చేయగా.. అతని భార్య తంజావూర్లో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించింది. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఇక ఉద్యోగం తనకు సెట్ అవ్వదు అని భావించి పోలీస్ ఉద్యోగం వదిలేసి గొర్లు మేకలు మేపడం మొదలుపెట్టాడు. అతను ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ అతన్ని తిట్టిపోశారు. కానీ ఇప్పుడు అతని టర్నోవర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. గొర్లు మేకలు మేపడంతో పాటు తంజావూర్ లో ఒక అతిపెద్ద ఫిట్నెస్ సెంటర్ ను నడుపుతున్నాడు సతీష్. వ్యవసాయ పనులు కూడా చూసుకుంటున్నాడు. నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఆయనకి మహేంద్ర సింగ్ ధోని కి సంబంధం ఏంటి అనుకుంటున్నారు కదా.. ఈయనకు స్ఫూర్తి మరెవరు కాదు ఎమ్మెస్ ధోని.. ఫలితం కంటే ప్రక్రియ ముఖ్యం అంటూ ధోని ఎప్పుడు చెబుతూ ఉంటాడు. ఇక ధోని చెప్పిన తత్వానికి కట్టుబడి లక్ష్యం వైపు పరుగులు తీస్తున్నానని సతీష్ చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: