అయితే ఇలా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీసుకు వస్తున్న కొత్త రూల్స్ లో మొదటిది సాఫ్ట్ సిగ్నల్ రూల్. అయితే ఇప్పుడు వరకు క్రికెట్లో కొనసాగిన సాఫ్ట్ సిగ్నల్ రూల్ ను రద్దు చేసింది ఐసిసి. ఇదిఎంపైర్లకు కొత్త తలనొప్పిని తీసుకురాబోతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు క్యాచ్ అవుట్ విషయంలో లేదంటే రన్ ఔట్ విషయంలో ఇక అంపైర్లు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు సాఫ్ట్ సిగ్నల్ గా తమ నిర్ణయాన్ని ప్రకటించి.. ఇక థర్డ్ అంపైర్ కు రిఫర్ చేసేవారు ఫీల్డ్ అంపైర్లు. థర్డ్ అంపైర్ దానిని గమనించి తుది నిర్ణయాన్ని ప్రకటించేవారు. ఒకవేళ థర్డ్ అంపైర్ కూడా కన్ఫ్యూజన్లో ఉంటే ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన సాఫ్ట్ సిగ్నల్ నే తుది నిర్ణయంగా ప్రకటించేవారు.
ఇప్పుడు ఈ రూల్ రద్దు చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఆటగాళ్లు హైరిస్క్ పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిబంధన తీసుకువచ్చింది ఐసీసీ. ఇక ఫ్రీ హిట్టు విషయంలో కూడా కొన్ని రూల్స్ సవరించింది. ఐసీసీ ఫ్రీ హిట్ సమయంలో బంతి స్టంప్స్ ను తాకినప్పుడు స్కోరు చేసిన .. లేదా బంతి బౌండరీ కి వెళ్ళినా కూడా పరుగులు పరిగణలోకితీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడుబంతి స్టంప్స్ తాకి ఫోర్ వెళ్లిన లేకపోతే బ్యాట్స్మెన్లు పరుగులు తీసిన పరుగనిస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి