2023 ఐపీఎల్ సీజన్ లో ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది ఈ లక్నో టీం. ఇక గత ఏడాది లాగానే వరుస విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టింది. అయితే రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరమైనప్పటికీ కృనాల్ పాండ్య కెప్టెన్సీ బాధ్యతలను భుజాన వేసుకుని జట్టును ఎంతో సమర్థవంతంగానే ముందుకు నడిపించాడు. అయితే ఇక ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన లక్నో టీం ఇటీవల అటు ముంబై ఇండియన్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి లక్నో ముందుకు వెళుతుంది అనుకుంటే ఊహించని రీతిలో ఓటమిపాలైంది.


 దీంతో ఇక ఐపీఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది లక్నో జట్టు. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ టైటాన్స్ తో తలబడే అవకాశాన్ని దక్కించుకుంది అని చెప్పాలి.  అయితే ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో ఓడిపోవడానికి ప్రధాన కారణం రన్ అవుట్లు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే పరుగు రానిచోట పరుగున సృష్టించాలని భావించిన లక్నో బ్యాట్స్మెన్ లు చివరికి అనవసరంగా రన్ అవుట్ అయ్యి జట్టు కొంప ముంచారు. ఒకవేళ ఇలా రనౌట్లు కాకుండా జాగ్రత్తపడి ఉంటే మాత్రం.. ఇక ముంబై తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని చేదించేదేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలిగింది. లక్నో జట్టులో కీలక బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న మార్కస్ స్టయినిస్, దీపక్ హుడా, కృష్ణప్ప గౌతమ్ రన్ అవుట్ అయ్యారు. అయితే ఈ ముగ్గురు కూడా లక్నో జట్టులో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లుగా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి కీలక ఆటగాళ్లు రన్ అవుట్ కావడంతో ఇక ముంబై నిర్దేశించిన  లక్ష్యాన్ని లక్నో చేదించలేకపోయింది. మరోవైపు ముంబై ఆటగాళ్లు ఫీల్డింగ్ లో ఎలాంటి తప్పిదాలు చేయకుండా అదరగొట్టారు. వచ్చిన అవకాశాలను ఎంతో బాగా సద్వినియోగం చేసుకున్నారు. దీంతో ఇక ఎంతో వ్యూహాత్మకంగా పోరు కొనసాగించిన ముంబై ఇండియన్స్.. లక్నోతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. అది కూడా భారీ తేడాతో.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl