
అయితే తన బ్యాటింగ్ లో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి అన్న విషయం పై స్పందించిన శుభమన్ గిల్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 ప్రపంచ కప్ తర్వాత న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు తన ఆటలో టెక్నిక్ పరంగా కొన్ని మార్కులు చిన్న సర్దుబాటు చేసుకోవడం తనకు ఎంతగానో కలిసి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. గత ఏడాది ఆస్ట్రేలియా లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో గిల్ కు జట్టులో చోటు తగ్గలేదు. కానీ ఆ తర్వాత నుంచి అతని జోరు మామూలుగా సాగడం లేదు. ఇక ఇప్పుడు గిల్ తన స్థానాన్ని భారత జట్టులో సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన ఫామ్ గురించి మాట్లాడుతూ.. 2022లో వెస్టిండీస్ పర్యటన నుంచి నేను గేర్ మార్చాను అని అనుకుంటున్నా..
గత ఏడాది ఐపీఎల్ కు ముందు గాయపడ్డాను. కానీ నా ఆటపై మాత్రం పని చేస్తూనే ఉన్నా. టి20 ప్రపంచ కప్ తర్వాత న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు టెక్నిక్ లో కొన్ని మార్పులు చేసుకున్న. ఐపీఎల్ లో క్వాలిఫైయర్ 2 లో ముంబై ఇండియన్స్ పై సాధించిన సెంచరీ తన ఐపిఎల్ లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటూ చెప్పుకొచ్చాడు. అంచనాలను బయట వదిలేసి మైదానంలో జట్టుకు తోడ్పాటు అందించేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను. ఒక్కో బంతిని ఒక్కో ఒవర్ ను ఆడుతూ ముందుకు సాగుతూ ఉంటాను. ముంబై తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్ లో మూడు సిక్సర్లు బాధడంతో లయ దొరికిందని.. ఇక ఆ తర్వాత సెంచరీ చేశానని చెప్పుకొచ్చాడు.