ఐపీఎల్ లో భాగంగా నేడు ఒక కీలకమైన మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం ఇక క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఎవరు ఐపీఎల్ టైటిల్ విన్నర్ గా నిలవబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ప్రస్తుతం భారత క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ ఫైనల్ ఆడబోయే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లలో ఉన్న ఆటగాళ్లు ఇప్పటివరకు సాధించిన రికార్డులు ఏంటి అన్న విషయాన్ని కూడా కొంతమంది తవ్వి చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల శుభమన్ గిల్ సాధించిన ఒక అరుదైన రికార్డు గురించిన చర్చ మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. శుభమన్ గిల్ వరుసగా మూడు సీజన్లలో ఐపిఎల్ ఫైనల్లో అడుగుపెట్టిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే  మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడుగా గిల్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోని ఐపిఎల్ హిస్టరీలో వరుసగా నాలుగు సార్లు ఫైనల్ ఆడిన ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు. 2010, 2011, 2012, 2013 సీజన్లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా చెన్నై జట్టును ఫైనల్ లో చేర్చి ఇక వరుసగా నాలుగు ఫైనల్స్ ఆడాడు. ఓవరాల్ గా చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున ఏకంగా తొమ్మిది సార్లు ఫైనల్ మ్యాచ్ ఆడాడు అని చెప్పాలి.. ఇక శుభమన్ గిల్ 2021 లో కోల్కతా తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఇక ఫైనల్  లో అడుగు పెట్టాడు. అప్పుడు కోల్కతా రన్నరఫ్ గా నిలిచింది. తర్వాత 2022లో గుజరాత్ తరఫున ఇక ఇప్పుడు 2023 లోను గుజరాత్ తరపున వరుసగా ఫైనల్లో మూడోసారి అడుగు పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gil