భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ గురించి అటు క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వీరేంద్ర సెహ్వాగ్  డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక తన బ్యాటింగ్ తో బౌలర్ల పై విరుచుకుపడుతూ.. ఇక భారీగా పరుగులు చేశాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు భారత క్రికెట్లో లెజెండరీ ప్లేయర్ గా ఉన్నాడు. అయితే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అటు వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు. ఈ క్రమంలోనే క్రికెట్ కు సంబంధించిన ఎన్నో విషయాలపై కూడా వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఆటగాళ్ల ప్రదర్శన పై తనదైన శైలిలో  రివ్యూ ఇస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు.  అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ గురించి కూడా స్పందించాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ చివరి దశకు చేరుకుంది.  నేడు జరగబోయే ఫైనల్ మ్యాచ్ తో ఇక 2023 ఐపీఎల్ కు తెర పడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఎన్నో రికార్డులు కూడా కొలగొట్టారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మంచి ప్రదర్శన చేసిన బ్యాట్స్మెన్ ల గురించి మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్ ఐపిఎల్ సీజన్లో తన ఫేవరెట్ ఆటగాళ్ళ జాబితాను ప్రకటించాడు. బ్యాటింగ్ విభాగంలో రింకు సింగ్, శివమ్ దుబే, యశస్వి జైస్వాల్,సూర్య కుమార్ యాదవ్, హెన్రిచ్ క్లాసేన్ తన ఉద్దేశం ప్రకారం ఐపిఎల్ సీజన్లో బ్యాటింగ్లో పంచ పాండవులు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో ఈ ఐదుగురు ఆటగాళ్లు కూడా తమదైన ఆట తీరుతో మెప్పించారు అంటూ ప్రశంసలు కురిపించాడు. చాలామంది ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేశారని.. అయితే ఓపెనర్లకు మాత్రం తన జాబితాలో చోటు ఇవ్వలేదు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: