
ప్లే ఆఫ్ లో భాగంగా ఇక ప్రతి మ్యాచ్ లో కూడా బౌలర్లు వేసిన ఒక్కో డాట్ బాల్ కి ఏకంగా 500 మొక్కలు నాటడానికి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఇక బిసిసిఐ తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌలర్ ఎవరైనా డాట్ బాల్ సందించాడు అంటే చాలు ఇక అక్కడ డాట్ బాల్ అన్నట్లుగా కాకుండా ఏకంగా ఒక చెట్టు గుర్తుని చూపించారు. ఈ క్రమంలోనే ప్లే ఆఫ్ లో జరిగిన అన్ని మ్యాచ్ లలో కలిపి బౌలర్లు ఎన్ని డాడ్ బాల్స్ వేశారు. ఇక ఇందుకు గాను బీసీసీఐ ఎన్ని మొక్కలు నాటబోతుంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఒక్కసారి ఆ లెక్కలు చూసుకుంటే ఏకంగా ప్లే ఆఫ్ లో జరిగిన అన్ని మ్యాచ్ లలో కలిపి వేసిన డాడ్ బాల్స్ కి గాను ఒక్కో డాట్ బాల్ కి 500 మొక్కలు చొప్పున 1.46 లక్షల మొక్కలను బిసిసిఐ నాటబోతుండట. గుజరాత్ వర్సెస్ చెన్నై మ్యాచ్ లో 84 డాట్ బాల్స్ నమోదు కాగా.. లక్నో- ముంబై మ్యాచ్లో 96, ముంబై- గుజరాత్ మ్యాచ్లో 67, ఇక ఫైనల్ లో చెన్నై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లో 45 డాడ్ బాల్స్ పడ్డాయి. మొత్తం నాలుగు మ్యాచ్ లలో కలిపి 292 డాట్ బాల్స్ ఉన్నాయి. ఇక ఒక్కో డాట్ బాల్ కు 500 మొక్కలు చొప్పున బిసిసిఐ 1.46 లక్షల మొక్కలు నాటబోతుంది అని చెప్పాలి.