గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో మూడు ఫార్మాట్ల ప్లేయర్గా మారిపోయాడు శుభమన్ గిల్. ఏ ఫార్మాట్ లో  అతను ఆడిన అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో సూపర్ ఫాం కనబరిచిన శుభమన్ గిల్ 2023 ఐపీఎల్ సీసన్ లోను ఇక అదే జోరుని చూపించాడు అనే విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున  ప్రాతినిధ్యం వహించిన శుభమన్ గిల్ ఓపనరుగా  బరిలోకి దిగుతూ భారీగా పరుగులు చేశాడు. ఇక గుజరాత్  ఫైనల్ వరకు వెళ్ళింది అంటే అందులో శుభమన్ గిల్ దే ప్రత్యేక పాత్ర ఉంది అని చెప్పాలి. అంతేకాదు కీలకమైన నాకౌట్ మ్యాచ్ లలో ఎంతో మంది ప్లేయర్లు ఒత్తిడితో పరుగులు చేయడానికి కష్టపడితే అటు శుభమన్ గిల్ మాత్రం ఏకంగా సెంచరీల మోత మోగించాడు.. వరుసగా సెంచరీలు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని ప్రదర్శన పై మాజీ ఆటగాళ్లు అందరు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే మొన్నటి వరకు ఐపీఎల్ లో గుజరాత్ గెలుపు కోసం ప్రయత్నించిన శుభమన్ గిల్ ఇక ఇప్పుడు భారత జట్టును గెలిపించేందుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ గడ్డపై ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గురించి ఇటీవల గిల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. నేను ప్రపంచ కప్ ఫైనల్స్ లో స్పైడర్ మాన్ లాగా ఉండాలి అనుకుంటున్నాను..ఎందుకంటే నాకు స్పైడర్ సెన్స్ ఉంటుంది కాబట్టి.. నేను ఎలాంటి బంతులను అయినా సరే ఎంతో ఈజీగా పట్టుకుంటాను అంటూ శుభమన్ గిల్ వ్యాఖ్యానించాడు. అయితే టీ20 ఫార్మాట్లో భీకరమైన ఫామ్ కనబరిచిన శుభమన్ గిల్ అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కూడా టీమ్ ఇండియా విజయం లో కీలక పాత్ర వహిస్తాడని అభిమానులు అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇక ఐపీఎల్ చివరి మ్యాచ్ వరకు కూడా టి20 ఫార్మాట్లో మ్యాచ్లు ఆడిన గిల్.. అతి తక్కువ సమయంలో టెస్ట్ ఫార్మాట్ కి కన్వర్ట్ అవుతాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: