సాధారణంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది . అయితే బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషయంలో మాత్రం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కాదు ఏకంగా మూడు పిట్టలు అన్న విధంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతోమంది విదేశీ ఆటగాళ్లు ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. దీనికి కారణం ఒక్క దెబ్బకి మూడు లాభాలు చేకూరుతాయి అని భావిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఎందుకంటే ఇక ఐపీఎల్ ఆడటం కారణంగా కోట్ల రూపాయల్లో ఆదాయం సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఐపీఎల్లో బాగా రాణిస్తే ప్రపంచ క్రికెట్లో అతని పేరు మారుమోగిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఇక వరల్డ్ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లు కోచ్ లతో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకొని గొప్ప అనుభవాన్ని సంపాదించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే ఐపీఎల్ ఆడటం ద్వారా ఎంతో లాభం ఉంది. కాబట్టే విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ లో భాగం కావడానికి తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే భారత క్రికెటర్ల తో పోల్చి చూస్తే అటు విదేశీ క్రికెటర్లే ఐపిఎల్ వేలంలోనూ ఎక్కువగా ధర పలకడం చూస్తూ ఉంటాం. అయితే 2023 ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన వేలంలో ఏకంగా ఎక్కువ ధర పలికిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు సామ్ కరణ్. 18.5 కోట్లకు పంజాబ్ జట్టు అతని సొంతం చేసుకుంది. కానీ ఐపిఎల్ లో ఆశించిన స్థాయిలో అతను ప్రదర్శన చేయలేదు. దీంతో అతనిపై పెట్టుకుని నమ్మకాన్ని నిరూపించుకోలేకపోయాడు. అయితే జట్టుకు ఉపయోగపడలేదని పంజాబ్ యాజమాన్యం భావిస్తుంది. దీంతో 2024 ఐపీఎల్ సీజన్ కి ముందు సామ్ కరణ్ ను వదిలించుకునే అవకాశం ఉందని అటు క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl