WTC ఫైనల్లో భాగంగా టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ బాగా అల్లాడిపోయాడు. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్లో ఈ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.ఇక అంతకముందు ఓవర్లోనే ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజాను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చిన సిరాజ్‌ అయితే చాలా మంచి జోరు మీద ఉన్నాడు. ఇక ఖవాజా ఔట్‌ కాగానే క్రీజులోకి వచ్చిన లబుషేన్‌ కుదురుకునే ప్రయత్నం చేశాడు.ఇక 8వ ఓవర్‌ తొలి బంతిని సిరాజ్‌ 143 కిమీ వేగంతో విసిరాడు. ఆ బంతి నేరుగా వచ్చి లబుషేన్‌ ఎడమ బొటనవేలిని తాకుతూ వెళ్లింది. దీంతో బ్యాట్‌ను కిందపడేసిన లబుషేన్‌ నొప్పితో బాగా అల్లాడిపోయాడు.ఫిజియో వచ్చి పరిశీలించిన తరువాత లబుషేన్‌ మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో అయితే సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.
అయితే ఇదిలా ఉండగా డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తుది జట్టులో స్నిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు దక్కకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే పిచ్‌ కండీషన్స్‌, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే అశ్విన్‌ను బెంచ్‌కు పరిమితం చేసినట్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ సమయంలో తెలిపాడు. ఇక అశ్విన్ ను పక్కన పెట్టడాన్ని టాస్ సందర్భంగా నాసిర్ హుస్సేన్ ప్రస్తావించాడు. దీనికి రోహిత్ శర్మ సమాధానమిస్తూ.. "ఇది ఎప్పుడైనా కూడా కఠిన నిర్ణయమే. అశ్విన్ చాలా ఏళ్లుగా మా మ్యాచ్ విన్నర్ గా ఉన్నాడు. అందుకే అతన్ని పక్కన పెట్టడం అన్నది చాలా కఠినమైన నిర్ణయమే. కానీ జట్టు అవసరాలకు తగినట్లు నిర్ణయాలను తీసుకోవాల్సిందే. అందుకే చివరికి ఈ కఠిన నిర్ణయం మేం తీసుకున్నాం.నిజానికి టెస్టుల్లో ప్రస్తుతం అశ్విన్ మొత్తం 869 పాయింట్లతో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వల్ల తీసుకోలేదు. అందుకే నలుగురు పేసర్ల, ఒక స్పిన్నర్ ను తీసుకున్నాం. ఇందులో జడేజా స్పిన్నర్ గా ఉంటాడు" అని రోహిత్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

WTC