ఇక ఫీల్డింగ్ లో కూడా భారత ఆటగాళ్లు అద్భుతమైన క్యాచ్లు పట్టి ఔరా అనిపించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో ఏకంగా ఒక ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా. కాగా సొంత గడ్డపై అటు వెస్టిండీస్ దారుణమైన ప్రదర్శన చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయని చెప్పాలి. ఓడిపోవడం కాదు కనీసం టీమ్ ఇండియాకు సరైన పోటీ కూడా ఇవ్వలేకపోయారు అంటూ ఎంతో మంది వెస్టిండీస్ మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి.
అయితే టీమిండియా చేతిలో తొలి టెస్ట్ మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం గురించి ఆ జట్టు కెప్టెన్ బ్రాత్ వైట్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు బ్యాట్స్మెన్ ల వైఫల్యం కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చాడు. పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించడంతో భారత బౌలర్లు అశ్విన్, జడేజా బౌలింగ్ ఎదుర్కోవడం ఎంతో కష్టంగా మారిపోయింది అంటూ తెలిపాడు. అయితే తాను కూడా పరుగులు రాబట్టడం విషయంలో విఫలమయ్యాను అంటూ కెప్టెన్ బ్రాత్ వైట్ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్ కోసం స్టేడియం కు వచ్చి తమకు మద్దతు తెలిపిన ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు అంటూ చెప్పాడు. రెండు టెస్ట్ మ్యాచ్ లో తప్పులను సరిచేసుకుని బరిలోకి దిగుతాం అంటూ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి