వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ గా కొనసాగుతున్న అన్ని జట్లు కూడా ప్రస్తుతం వరుస టెస్ట్ సిరీస్ లతో బిజీబిజీగా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన యాసిష్ సిరీస్ జరుగుతూ ఉండగా.. ఇటీవల భారత జట్టు అటు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ముగించుకుంది. ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించింది. అదే సమయంలో ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్తాన్ జట్టు అక్కడ టెస్ట్ సిరీస్ ఆడుతూ ఉంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక ఈ టెస్ట్ సిరీస్ ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా మారిపోయింది అని చెప్పాలి. అటు శ్రీలంక గడ్డపై పాకిస్తాన్ ప్లేయర్లు సత్తా చాటుతూ ఎన్నో రికార్డులను కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంకను సొంత గడ్డపైనే ఓడిస్తూ ఊహించని షాక్ ఇస్తుంది పాకిస్తాన్. అయితే ఇప్పటికే జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో అటు పాకిస్తాన్ జట్టు ఘన విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి మ్యాచ్ లో గెలిచిన జోరునే అటు రెండో మ్యాచ్లో కూడా చూపించింది పాకిస్తాన్. శ్రీలంకను చిత్తుగా ఓడించింది అని చెప్పాలి. దీంతో సిరీస్ కూడా కైవసం చేసుకుంది.


 ఏకంగా పాకిస్తాన్ బౌలింగ్ విభాగం అదరగొట్టడంతో శ్రీలంక 158 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో ఇన్నింగ్స్ తో పాటు 2002 పరుగుల తేటతో పాకిస్తాన్ ఘనవిజయాన్ని అందుకుంది. అప్పటికి మొదటి మ్యాచ్ గెలిచిన పాకిస్తాన్.  2-0 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. అయితే 36 ఏళ్ల స్పిన్నర్ అలీ రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లతో అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోని అరుదైన రికార్డు కూడా సృష్టించాడు. కాగా శ్రీలంక టీమ్ సొంత గడ్డపై పరుగులపరంగా ఇదే అతి పెద్ద పరాజయం కావడం గమనార్హం. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 176 పరుగులు చేయగా.. అటు పాకిస్తాన్ మాత్రం 576 పరుగులు చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: