అక్టోబర్ 5వ తేదీ నుంచి టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వరల్డ్ కప్ భారత్ వేదికగా జరుగుతూ ఉండడంతో ఇక టీమ్ ఇండియాకు మరింత స్పెషల్ గా మారింది. ఎన్నో రోజుల నుంచి భారత జట్టును వేధిస్తున్న వరల్డ్ కప్ టైటిల్ ఈసారి ఎలాగైనా కొట్టాలని టీమిండియా భావిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇక పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతూ ఉంది. అయితే ఇటీవల అటు ఆసియా కప్ ను ముగించుకుంది టీమిండియా.


 ఆసియా కప్ లో భాగంగా వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్ వరకు దూసుకెళ్లిన భారత జట్టు ఇక ఫైనల్లో శ్రీలంక టీం ని చిత్తుగా ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది అని చెప్పాలి. దీంతో వరల్డ్ కప్ కి ముందు అటు టీమ్ ఇండియాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. అయితే ఇక ఇప్పుడూ అటు భారత్ వేదికగా పటిష్టమైన ఆస్ట్రేలియా తో మూడు మ్యాచ్లు వన్డే సిరీస్ ఆడటానికి సిద్ధమవుతుంది. అయితే ఈ వన్డే సిరీస్ కోసం ఇటీవల అటు బిసిసిఐ జట్టు వివరాలను ప్రకటించింది. అయితే ఇటీవల బీసీసీఐ ప్రకటించిన జట్టులో అటు స్టార్ స్పిన్నర్ యుజువేంద్ర చాహాల్ పేరు లేకపోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతకుముందు ఆసియా కప్ లో కూడా సెలెక్టర్లు అతని పక్కన పెట్టారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు చాహల్ను ఎంపిక చేయకపోవడంపై మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఉండదగిన ఆటగాళ్లలో చాహల్ కూడా ఒకరు. కానీ ఎందుకు ఎంపిక చేయలేదో అర్థం కావట్లేదు. అతను జట్టులో ఎవరితోనైనా గొడవపడి ఉంటాడేమో అంటూ అర్భజన్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. లేదంటే చాహల్ ఎవరి విషయంలో అయినా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడేమో.. అందుకే సెలెక్టర్లు పక్కన పెడుతున్నారు అంటూ హార్బర్జన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: