ఇటీవల కాలంలో టీమిండియాలో యంగ్ ప్లేయర్స్ హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది యువ ఆటగాళ్లు దేశవాలి క్రికెట్లో సత్తా చాటెందుకు ఇక టీమిండియాలోకి వస్తున్నారు. ఇక యంగ్ ప్లేయర్స్ అందరికి కూడా ఐపీఎల్ రూపంలో ఒక మంచి అవకాశం అందుబాటులో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపిఎల్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఎంతోమంది అదరగొడుతున్నారు అని చెప్పాలి.


 అయితే ఇలా ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ టీమ్ ఇండియాలోకి వస్తున్న సమయంలో.. ఒక టాలెంటెడ్ ప్లేయర్ మాత్రం ఇక టీమిండియా ఆడుతున్న ప్రతి సిరీస్ లో కూడా వివక్షకు గురవుతూనే ఉన్నాడు. ఆ ఆటగాడు ఎవరో కాదు సంజూ శాంసన్ వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ అయిన ఈ ఆటగాడు ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఎంతో మంది ప్లేయర్స్ తో పోల్చి చూస్తే చాలా బెటర్ అని చెప్పాలి. అతని గణాంకాలు కూడా బాగానే ఉన్నాయి. కానీ అతన్ని కాదని ఫామ్ లో లేని ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతున్న సెలెక్టర్లు.. ఇక అతని తరచూ జట్టు నుంచి పక్కన పెడుతూనే ఉన్నారు.


 ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ముగిసిన ఆసియా కప్ లో భాగంగా అతన్ని స్టాండ్ బై ప్లేయర్గా ఎంపిక చేసినప్పటికీ కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో చివరికి అతన్ని పక్కన పెట్టేశారు. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే వన్de సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో కూడా సంజూ శాంసన్ చోటు దక్కలేదు. ఇక చైనాలో జరిగే ఆసియా క్రీడలకు కూడా అతని సెలెక్ట్ చేయలేదు. దీంతో తీవ్ర నిరాశలో మునిగిపోయాడు సంజూ. ఈ క్రమంలోనే తన అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఇకపైన ఆటను కొనసాగించడమే నా పని అని రాసుకొచ్చాడు. కాగా 8 ఏళ్ల కెరియర్లో అతను 8 వన్డే మ్యాచ్లు, 24 t20 మ్యాచ్ లు మాత్రమే టీమిండియా కు ప్రాతినిధ్యం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: