ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ప్రతి పోరు ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉండగా.. ఇక ఇటీవల ఒక రసవత్తరమైన పోరు జరిగింది అన్న విషయం తెలిసిందే. 2023 వరల్డ్ కప్ ఎడిషన్ లో ఓటమి ఎరుగని టీమ్స్ గా దూసుకుపోతున్న రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.  నాలుగు మ్యాచ్ లలో నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్న న్యూజిలాండ్, భారత్ మధ్య మ్యాచ్ జరిగింది  దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఒకవైపు గాయాల బెడత వేధిస్తున్న.. సొంత గడ్డపై ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టు ఇక న్యూజిలాండ్ విజయాల పరంపరకు బ్రేక్ వేసింది అని చెప్పాలి. నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో భారత జట్టు విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్లకు గాను అన్ని విజయాలు సాధించి ఇక పాయింట్లు పట్టికలో పది పాయింట్లతో టాప్ లో కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక మొన్నటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన న్యూజిలాండ్ రెండవ స్థానంలోకి పడిపోయింది. అయితే బంగ్లాదేశ్ తో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా గాయపడటంతో ఇక అతని స్థానంలో భారత జట్టులోకి ఇద్దరు ప్లేయర్లను రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బౌలర్గా షమీని బ్యాట్స్మెన్ గా సూర్య కుమార్ జట్టులోకి తీసుకున్నారు.


 అయితే వరల్డ్ కప్ కోసం ఎంపికైనప్పటికీ మొదటి మ్యాచ్ నుంచి బెంచ్ కే పరిమితం అయ్యాడు షమి. అయితే ఇటీవల న్యూజిలాండ్తో మ్యాచ్లో వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు. తను ఎంత కీలక ప్లేయర్ అన్న విషయాన్ని నిరూపించాడు. ఏకంగా న్యూజిలాండ్తో మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన టీమ్ ఇండియా బౌలర్ షమీ వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించాడు. 48 ఏళ్ల వరల్డ్ కప్ హిస్టరీలో రెండుసార్లు ఐదు వికెట్లు తీసిన భారత ఆటగాడిగా నిలిచాడు షమి. ఇక ప్రపంచ కప్ లో అతను మరో 9 వికెట్లు తీశాడు అంటే చాలు భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ప్రస్తుతం టీమిండియా తరఫున జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్ 44 వికెట్లతో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: