కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో పూర్తి సభ్యత్వం లేని అసోసియేట్ దేశం తరఫున ఆడుతూ ఎన్ని మంచి ప్రదర్శనలు చేసిన ఆయా ఆటగాళ్లకు మాత్రం తగిన గుర్తింపడం చాలా అరుదు. కేవలం కొంతమంది ఆటగాళ్లు మాత్రమే ఇలా గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఒక చిన్న టీం తరఫున ఆడుతూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సికిందర్ రజా కూడా ఒకరు. జింబాబ్వే జట్టు తరఫున ఆల్రౌండర్ గా కొనసాగుతున్నాడు సికిందర్ రజ.
2022 వరల్డ్ కప్ సమయం లో జింబాబ్వే తరఫున ఆడుతూ ఎన్నో సంచలనాలు నమోదు చేశాడు. దీంతో అతని పేరు మారుమోగిపోయింది. ఇక ఐపీఎల్ లో కూడా ఛాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు సికిందర్ రజా కెప్టెన్ అయ్యాడు. 37 ఏళ్ల రజకు టి20 లీగ్ లలో వివిధ జట్లకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. దీంతో జింబాబ్వే టి20 అతను నియమితుడు అయ్యాడు. పాకిస్తాన్ కు చెందిన రజా జింబాబ్వే కు వలస వెళ్ళాడు. ఇక ఆ దేశం తరపున రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు. కాగా ఐపీఎల్ లో పంజాబ్ జట్టు తరఫున అతను ప్రాతినిధ్యం వహించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి