క్రికెట్ అనేది ఫన్నీ గేమ్ అని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూసిన తర్వాత క్రికెట్ అనేది ఫన్నీ గేమ్ కాదు అగ్రసీవ్ గేమ్ అని ప్రేక్షకులకు  అనిపిస్తూ ఉంటుంది  ఎందుకంటే మైదానం లో బరిలోకి దిగిన ప్లేయర్స్ అందరూ కూడా ఇక తమ జట్టును గెలిపించు కోవడం కోసం సాయి శక్తుల కృషి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. గెలుపు కోసం చేసే పోరాటం లో కొన్ని కొన్ని సార్లు ఇక తమ హావభావాలను వ్యక్తపరచడం లో దూకుడు చూపిస్తూ ఉంటారు.


 తెలియకుండానే ఏకంగా ప్రత్యర్థి జట్టు ప్లేయర్ల తో గొడవలకు దిగడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ఇలా ఏకంగా ప్రత్యర్థి ఆటగాళ్ళను  మరో టీం ప్లేయర్స్ కవ్వింపులకు   పాల్పడటం ఇప్పటినుంచి కొనసాగుతుంది కాదు. ఎన్నోసార్లు ఏకంగా ఇరు జట్లకు చెందిన ప్లేయర్లు కొట్టుకునేంతవరకు కూడా మైదానంలో గొడవ జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తనకు కూడా ఇలాగే ఒక ఆటగాడితో గొడవ జరిగితే అతను నన్ను చంపేస్తాడేమో అని భయమేసింది అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్.


 ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ మాజీ ఆటగాడు.. వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్మెన్ వివ్ రిచర్డ్స్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 1988లో ఒక టెస్టులో వివ్ రిచర్డ్స్ కి బౌన్సర్ వేసి నాకు వచ్చిన రెండు ఇంగ్లీష్ పదాలు అతనిపై వాడేసాను. అప్పుడు అతను నన్ను రెచ్చగొడితే చంపేస్తాను అంటూ బెదిరించాడు. అంతలోనే మరో బౌన్సర్ వేసి అతని అవుట్ చేశా. ఇక మరసటి రోజు వివ్ రిచర్డ్స్ షర్ట్ లేకుండా నా గది ముందుకు వచ్చి నిలబడ్డాడు. దీంతో అతను నన్ను చంపేస్తాడని ఎంతగానో భయపడ్డా అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: