
అయితే గత కొంతకాలం నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంతో మంది ఆటగాళ్లను మారుస్తూ వస్తుంది. అయితే ఇలా ఎంతో మంది ప్లేయర్స్ ని మార్చిన ఆ జట్టుకు అదృష్టం మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. భారీ అంచనాల మధ్య టీంలోకి వచ్చిన ప్లేయర్లు నిరాశ పరుస్తూ ఉండడంతో ప్రతి సీజన్లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టలేక పోతుంది అని చెప్పాలి. అయితే ఈసారి మాత్రం ఇలా జట్టులోకి తీసుకునే ఆటగాళ్ల విషయంలో పకడ్బందీ ప్లాన్ ని సన్రైజర్స్ సిద్ధం చేసింది అనేది తెలుస్తుంది. ఇక ఇదే విషయంపై టీం ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్న న్యూజిలాండ్ యంగ్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర పై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కన్నేసింది అంటూ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ లో అతడు పెర్ఫార్మెన్స్ బాగుందని ప్రశంసలు కురిపించాడు ఇర్ఫాన్. ఇక వికెట్లు తీయడమే కాక బ్యాటింగ్లో కూడా రాణించే ఒక మంచి ఆల్ రౌండర్ కోసం సన్రైజర్స్ ఎంతగానో ఎదురు చూస్తుంది. అభిషేక్ కు జోడిగా దిగేందుకుగాను ఇక రచిన్ రవీంద్రను సొంతం చేసుకునేందుకు సన్రైజర్స్ భారీ మొత్తం పెట్టడానికైనా సిద్ధంగా ఉండవచ్చు అంటూ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.