ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని టీమ్స్ కూడా ఈసారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరులోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్. అయితే అటు బీసీసీఐ కూడా మార్చ్ నెల తర్వాత సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక ఐపీఎల్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలుగుకుండా ఉండేందుకు ప్రణాళిక బద్ధంగా షెడ్యూల్ ని సిద్ధం చేస్తుంది అని చెప్పాలి.


 అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగపోతుంది. గత ఏడాది ఎంతో అద్భుతంగా రానించి టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక వరుసగా మరోసారి కూడా టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉండి చెన్నై సూపర్ కింగ్స్. కానీ ఊహించని రీతిలో చెన్నై జట్టుకు ఆటగాళ్లు గాయం బారిన పడుతూ ఉండడంతో ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది. ఏకంగా జట్టులో ఉన్న స్టార్ ఆల్ రౌండర్ ఇక జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న శివం దూబే ఇక జట్టు టైటిల్ విజేతగా నిలవడంలో ఎంతో కీలకపాత్ర వహించాడు.


అయితే ఇటీవల ఈ స్టార్ ఆల్ రౌండర్ గాయం బారిన పడ్డాడు. రాంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను అస్సాంతో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పక్కటెముకలు పట్టేయడంతో నొప్పితో విలవిలలాడిపోయాడు. ఈ క్రమంలోనే రంజి సీజన్లో మిగిలిన మ్యాచ్ లకు అతను దూరం కాబోతున్నాడు అని చెప్పాలి. అయితే ఈ గాయం నుంచి కోలుకునేందుకు దాదాపు ఆరువారాల సమయం పట్టే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే మరో నెల రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. అప్పటివరకు అతను పూర్తిస్థాయిలో కోలుకోకపోతే.. ఇక ఐపీఎల్ లోని కొన్ని మ్యాచ్ లకు అతను దూరం కాబోతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl